కర్ణాటకలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి రాగా ప్రజలు ఇబ్బందిపడ్డారు.
మరో 3 రోజుల్లో భారీ వర్షాలు..
అయితే.. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). గురు, శుక్రవారాల్లో కర్ణాటక తీరప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
కొట్టుకుపోయిన ట్రాక్టర్
రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతంలో ఓ ట్రాక్టర్ వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. దేవరకోట గ్రామంలో వేదవతి నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ కూలిపోవడం వల్లే ఈ ఘటన జరగిందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: టీచరమ్మ చేతిలో పులకరించిన పచ్చదనం