దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, బలమైన ఈదురుగాలులతో ముంబయి నగరంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపడటం వల్ల వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహానగరాన్ని మింగేస్తాయా అన్నట్లు సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన ముంబయి నగరపాలక సంస్థ.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపడుతోంది.
ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ