కర్ణాటకలో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కలబురగి, యాదగిరి, బాగల్కోటే, బెళగావి, బీదర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 10 వంతెనలు కూలిపోయాయి.
బాగల్కోటే జిల్లాలోని రాబకవి బానహట్టిలో 111 ఇళ్లు నేలమట్టమయ్యాయి. యాదగిరి జిల్లాలో ఓ రైతు ఇల్లు కూలి.. లోపల నిల్వ చేసిన పత్తి తడిసిపోయి... భారీ నష్టం వాట్లింది. చేతికందొచ్చే సమయంలో వర్షాల వల్ల చెరకు పంట నేలమట్టమైంది. బెళగావిలో వరద ధాటికి కొన్ని చోట్ల రహదాలు కొట్టుకుపోయాయి.
జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: కుమారుడి ప్రాణాల కోసం మరో బిడ్డకు జన్మ