ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల-ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారి 43 మంది మృతిచెందారు. మరోమారు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. అందులో భాగంగా.. షహీన్‌బాగ్ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు.
పౌర చట్టానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఈశాన్య దిల్లీ, షహీన్‌బాగ్ ప్రాంతాల్లో పలువురు మహిళలు నిరసన చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు మార్చి 1 నాటికి నిరనలనలు ఆపేయాలని హిందూసేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్టు పోస్టర్లు దర్శనమిచ్చాయి.
సకాలంలో పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులు ఆందోళనలను విరమించేలా చేశారని ఈశాన్య దిల్లీ పోలీస్ కమిషనర్ ఆర్పీ మీనా తెలిపారు. అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా భారీ సిబ్బందిని మోహరించామని చెప్పారు.
ఇదీ చదవండి: నితీశ్ కుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.!