కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు విద్వేష ప్రసంగాలు చేశారని.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
లాయర్స్ వాయిస్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ సీ హరి శంకర్ ధర్మాసనం వద్ద ప్రస్తావించగా.. శుక్రవారం విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది.
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లాహ్ ఖాన్, ఏఐఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించడానికి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్లో కోరారు.
గాయపడ్డ వారిని, మృతదేహాలను సురక్షితంగా ఆసుపత్రులకు చేరవేసేందుకు సంబంధించిన వ్యాజ్యాలపైనా దిల్లీకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.