'గాంధీ' కుటుంబ సభ్యులు విద్వేష ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై కేంద్రంతో పాటు కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన కోరింది దిల్లీ హైకోర్టు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై ఈ మేరకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వంతోపాటు స్థానిక పోలీసులకు నోటీసులు ఇచ్చింది.
వీరితో పాటు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్, ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వారీస్ పఠాన్లపైనా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపైనా సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
ఇదిలా ఉంటే విద్వేష ప్రసంగాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని మరో వ్యాజ్యం దాఖలైంది.