ETV Bharat / bharat

నవ దంపతులకు హైకోర్టు షాక్​.. 10 వేల జరిమానా!

author img

By

Published : Jun 3, 2020, 11:01 AM IST

తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్- హరియాణా హైకోర్టును ఆశ్రయించింది ఓ జంట. అయితే వారి పిటిషన్​ను పరిశీలించిన కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఆదుకోమని ఆశ్రయిస్తే న్యాయస్థానం జరిమానా ఎందుకు విధించింది? అసలు వారు కోర్టుకు ఎందుకు వెళ్లారో తెలుసుకుందాం!

HC imposes Rs 10,000 as costs on couple for not wearing masks during marriage
నవ దంపతులకు హైకోర్టు షాక్​.. 10 వేల జరిమానా!

రక్షణ కల్పించాలంటూ పంజాబ్​- హరియాణా ఆశ్రయించిన నవ దంపతులకు హైకోర్టును రూ.10 వేల జరిమానా విధించిన విచిత్ర సంఘటన చండీగఢ్​​లో​ జరిగింది. అనంతరం వారికి రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించింది హైకోర్టు.

ఇదీ జరిగింది...

గురుదాస్​పుర్​కు చెందిన యువతి, యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో భయపడిన ఆ నవ దంపతులు.. తమకు రక్షణ కల్పించాలంటూ మే 23న గురుదాస్​పుర్ ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం హైకోర్టులోనూ తమ వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలతో పిటిషన్​ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా చిత్రాలను పరిశీలించిన హైకోర్టు పెళ్లి సమయంలో వేడుకకు హాజరైన ప్రజలు, దంపతులు మాస్క్​లు ధరించలేదని గుర్తించి.. వారికి రూ. 10 వేల జరిమానా విధించింది. అనంతరం దంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:తరుముకొస్తున్న నిసర్గ - అప్రమత్తమైన రాష్ట్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.