కరోనాను తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు జనం. ఇక పంజాబ్ అమృత్సర్లో వైరస్ను శాంతిపరిచేందుకు మహాయజ్ఞమే నిర్వహించారు.. శ్రీ హనుమాన్ సేవా సమితి సభ్యులు. 108 హోమగుండాలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.
హనుమాన్ చాలీసా, మహా మృత్యుంజయ్, సర్వమంగళ మాంగళ్యం వంటి మంత్రాలు ఉచ్ఛరిస్తూ.. శాంతి పూజలు నిర్వహించారు.
"కరోనా వైరస్ నుంచి విముక్తి పొందడానికి మేము దాదాపు 500 కుటుంబాలను ఒక్క చోట కూర్చోబెట్టి యాగం నిర్వహించాం. వైరస్ వల్ల ఈ విశ్వంలో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది.. ప్రపంచమంతా కంపించింది. ఈ ఆందోళనలు దూరం చేసేందుకు హనుమాసేవా సమితి తరఫున మహా యజ్ఞం జరిపించాం. వేలాదిమంది హోమాల్లో ఆజ్యాలు పోస్తున్నారు. దాదాపు మూడు గంటలు ఈ యజ్ఞ కార్యక్రమం సాగుతుంది."
- అధ్యక్షుడు, హనుమాన్ సేవా సమితి
ఇదీ చదవండి:రామజన్మ భూమిలో తొలిసారి హారతి దర్శనం ఆ రోజే