ETV Bharat / bharat

'కరోనా కాలంలో సరికొత్త జీవనశైలి అవసరం' - venkaiah naidu on corona virus

కరోనా మహమ్మారి ప్రజల మధ్య బంధం, సామాజిక బాధ్యతను గుర్తు చేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ఒంటరి జీవితాన్ని వదిలి ప్రకృతి, సమాజం కోసం బతకాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందని అభిప్రాయపడ్డారు.

VIRUS-VP-LIFE
'కరోనా కాలంలో సమాజం కోసం జీవించాలి'
author img

By

Published : May 18, 2020, 6:09 PM IST

కరోనాతో కలిసి జీవించాల్సి వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ మహమ్మారి నేర్పిన పాఠాలకు అనుగుణంగా కొత్త జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్​డౌన్​ను మే 31వరకు కేంద్రం పొడిగించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.

"కరోనాకు ముందు ఆనందం, సంపద కోసం ఒంటరిగా జీవించేవాళ్లం. కాలం మారుతున్న కొద్దీ కుటుంబ, సామాజిక అనుబంధాలు తగ్గాయి. ఒంటరిగా జీవించాలనే అర్థంలేని భావన పుట్టుకొచ్చింది. కానీ కరోనా వీటన్నింటినీ మార్చింది" అని ఫేస్​బుక్​ పోస్టులో పేర్కొన్నారు వెంకయ్య.

"జీవితంలో ఒంటరిగా ఉండలేం. మనుషుల మధ్య పరస్పర అనుబంధాన్ని ఈ మహమ్మారి గుర్తుచేసింది.

జీవనశైలిలో కరోనా వల్ల అనేక మార్పులు వచ్చాయి. ప్రకృతి, సమాజం కోసం సామరస్యంగా బతకాల్సిన అవసరం ఉందని కరోనా గుర్తు చేసింది. జీవితం చాలా వేగంగా మారుతుందని నిరూపించింది."

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

సమాజంలో ఆర్థిక విధానాల వైఫల్యం వల్ల జరిగే పరిణామాలను ఈ వైరస్ వ్యాప్తి కళ్లకు కట్టిందని వెంకయ్య అన్నారు. అయితే ఈ అనిశ్చితి ప్రజలను వెంటాడుతుందని.. మానసిస రుగ్మతలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రశాంతంగా, నమ్మకంతో ఉండటమే మార్గమని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.