దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేయడంలో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని చెత్త నుంచి విముక్తి చేసే ముందు రోజురోజుకూ పెరిగిపోతున్న అబద్ధాల వ్యర్థాలను శుభ్రపరచాలని ఎద్దేవా చేశారు. ముందుగా.. చైనా చొరబాట్లపై స్పందించి సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని విమర్శించారు.
స్వచ్ఛ భారత్ అంశంపై వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు మోదీ. ఇందులో పాల్గొని చెత్త విముక్త భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం చేసిన ట్వీట్‌పై రాహుల్ స్పందించారు.
-
क्यों नहीं! हमें तो एक कदम आगे बढ़कर, देश में लगातार बढ़ती 'असत्य की गंदगी' भी साफ़ करनी है।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
क्या प्रधानमंत्री चीनी आक्रमण का सत्य देश को बताकर इस सत्याग्रह की शुरुआत करेंगे? pic.twitter.com/c3b5bzC48T
">क्यों नहीं! हमें तो एक कदम आगे बढ़कर, देश में लगातार बढ़ती 'असत्य की गंदगी' भी साफ़ करनी है।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020
क्या प्रधानमंत्री चीनी आक्रमण का सत्य देश को बताकर इस सत्याग्रह की शुरुआत करेंगे? pic.twitter.com/c3b5bzC48Tक्यों नहीं! हमें तो एक कदम आगे बढ़कर, देश में लगातार बढ़ती 'असत्य की गंदगी' भी साफ़ करनी है।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020
क्या प्रधानमंत्री चीनी आक्रमण का सत्य देश को बताकर इस सत्याग्रह की शुरुआत करेंगे? pic.twitter.com/c3b5bzC48T
"మనం మరో అడుగు ముందుకు వేసి దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అబద్ధాల చెత్తను శుభ్రం చేయాలి. చైనా దురాక్రమణపై ప్రధాని నిజాలు చెప్పి సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తారా?."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
యాదృచ్ఛికం కాదు
చైనా దురాక్రమణకు సంబంధించిన పత్రాలను రక్షణ శాఖ తొలగించడంపైనా విమర్శలు సంధించారు రాహుల్.
-
जब जब देश भावुक हुआ, फ़ाइलें ग़ायब हुईं।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
माल्या हो या राफ़ेल, मोदी या चोक्सी...
गुमशुदा लिस्ट में लेटेस्ट हैं चीनी अतिक्रमण वाले दस्तावेज़।
ये संयोग नहीं, मोदी सरकार का लोकतंत्र-विरोधी प्रयोग है।
">जब जब देश भावुक हुआ, फ़ाइलें ग़ायब हुईं।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020
माल्या हो या राफ़ेल, मोदी या चोक्सी...
गुमशुदा लिस्ट में लेटेस्ट हैं चीनी अतिक्रमण वाले दस्तावेज़।
ये संयोग नहीं, मोदी सरकार का लोकतंत्र-विरोधी प्रयोग है।जब जब देश भावुक हुआ, फ़ाइलें ग़ायब हुईं।
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2020
माल्या हो या राफ़ेल, मोदी या चोक्सी...
गुमशुदा लिस्ट में लेटेस्ट हैं चीनी अतिक्रमण वाले दस्तावेज़।
ये संयोग नहीं, मोदी सरकार का लोकतंत्र-विरोधी प्रयोग है।
"దేశం భావోద్వేగానికి గురైనప్పుడల్లా.. దస్త్రాలు కనుమరుగవుతాయి. అది మాల్యా అయినా.. రఫేల్ అయినా లేదా మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ విషయమైనా. ఇప్పడు తప్పిపోయిన జాబితాలో చైనా ఆక్రమణకు సంబంధించిన పత్రాలు సైతం చేరిపోయాయి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
పత్రాలు తొలగించడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఆరోపించారు రాహుల్. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేసిన ప్రయోగమని అన్నారు.