ఉత్తర్‌ప్రదేశ్‌లోని 'హాథ్రస్' అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు నవంబర్ 2న హైకోర్టులో మరోసారి హాజరు కానున్నారు. సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రాజన్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది.
విచారణలో భాగంగా యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏడీజీ(శాంతి భద్రతల విభాగం) సహా.. హాథ్రస్ జిల్లా పాలనాధికారి(డీఎం), ఎస్పీ తమ వాదనలు వినిపించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొనే మృతదేహానికి రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించామని.. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని కోర్టుకు తెలిపారు డీఎం.
ఈ విచారణకు బాధితురాలి తల్లిదండ్రులు సహా ముగ్గురు సోదరులు పటిష్ఠ భద్రతల నడుమ లఖ్‌నవూ కోర్టుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'హాథ్రస్ కేసులో అనైతికంగా యోగి సర్కార్ తీరు'