ETV Bharat / bharat

' కవిత్వం సరే.. చైనా ఆక్రమణపై నిజాలు చెప్పండి' - rahul commnets on india china

హస్తం గుర్తుపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కవిత్వాలు పూర్తయిన తర్వాత లద్ధాఖ్​లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమణపై నిజాలు వెల్లడించాలని రాజ్​నాథ్​ను సూటిగా ప్రశ్నించారు.

RAHUL-RAJNATH-CHINA
రాహుల్ గాంధీ
author img

By

Published : Jun 9, 2020, 2:59 PM IST

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన అంశానికి సంబంధించి కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి కవితాత్మకంగా విమర్శలు చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ మంగళవారం సూటి ప్రశ్న వేశారు.

  • Once RM is done commenting on the hand symbol, can he answer:

    Have the Chinese occupied Indian territory in Ladakh?

    — Rahul Gandhi (@RahulGandhi) June 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చేతి గుర్తును ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కామెంట్ చేయడం పూర్తయిన తర్వాత.. లద్దాఖ్‌లో చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

మాటల యుద్ధం..

ఉర్దూ కవిత్వంలోని ఒక వాక్యం తీసుకొని, సోమవారం రాజ్‌నాథ్ కాంగ్రెస్‌ మీద వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఈ మాటల యుద్ధం.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సరిహద్దు పరిస్థితిపై ఓ వర్చువల్ ర్యాలీలో మాట్లాడటంతో ప్రారంభమైంది.

  • मिर्ज़ा ग़ालिब का ही शेर थोड़ा अलग अन्दाज़ में है। ‘

    ‘हाथ’ में दर्द हो तो दवा कीजै,
    ‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.. https://t.co/k1fhnI6K4N

    — Rajnath Singh (@rajnathsingh) June 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత భారత్‌కే సరిహద్దులను రక్షించుకొనే సామర్థ్యం ఉంది" అని వ్యాఖ్యానించారు అమిత్ షా. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. హృదయాన్ని సంతోషంగా ఉంచుకోడానికి, మంచి ఆలోచన అవసరం అంటూ విమర్శలు చేశారు.

హస్తం గుర్తుపై రాజ్​నాథ్ కవిత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా కూడా విమర్శించారు. "పార్టీ చిహ్నాలను కించపరచటం, దేశాన్ని రక్షించటం ఒక్కటి కాదు. రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు రాజ్​నాథ్​ సమాధానం చెప్పగలరా?" అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'సీడీఎస్​'తో రాజ్​నాథ్​ భేటీ.. చైనా సరిహద్దుపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.