హరియాణా విధానసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం అధికార భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది.
శాసనసభ ఎన్నికలు ముగిసన అనంతరం ఎగ్జిట్ పోల్స్ భాజపాకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీతో మరోమారు అధికారం చేపడుతుందని తేల్చాయి. కానీ ఊహించనదానికన్నా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జోరు కనబరుస్తోంది.
ఇతర పార్టీలతో కలిసి అధికారం..!
కాంగ్రెస్కు దూరంగా ఉన్న జేజేపీ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం... జేజేపీ, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిస్తే కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు అనుకూలత ఉన్నందున సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి: 'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..