ETV Bharat / bharat

హరియాణా ఎన్నికల పోరు: మరికాసేపట్లో పోలింగ్​ - హరియాణా పోలింగ్

హరియాణా శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 90 స్థానాలకు ఒకే విడతలో జరగుతున్న ఎన్నికల పోలింగ్​ మరికాసేపట్లో మొదలుకానుంది. 1,169 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

హరియాణా ఎన్నికల పోరు: మరికాసేపట్లో పోలింగ్​
author img

By

Published : Oct 21, 2019, 5:18 AM IST

Updated : Oct 21, 2019, 8:08 AM IST

హరియాణా ఎన్నికల పోరు: మరికాసేపట్లో పోలింగ్​

హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 1,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 105 మంది మహిళలున్నారు. 85 లక్షల మంది మహిళలతో సహా మొత్తం కోటీ 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హరియాణా అసెంబ్లీ పోరు వివరాలు

  • నియోజకవర్గాలు : 90
  • అభ్యర్థులు : 1,169
  • ఓటర్లు : 1,83,00000
  • పోలింగ్​ కేంద్రాలు : 19,578
  • భద్రతా సిబ్బంది : 75,000
  • వీవీప్యాట్ యంత్రాలు: 27,611

భారీ భద్రత...

పోలింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 75 వేల మంది పోలీసులను, 130 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

నువ్వా-నేనా...

90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో భాజపా,కాంగ్రెస్​తో పాటు ఐఎన్​ఎల్​డీ, జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), హరియాణా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ (హెచ్​జేసీ), ఆమ్ ఆద్మీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ, స్వరాజ్ ఇండియా తదితర చిన్నపార్టీలూ పోటీ పడుతున్నాయి. అయితే ప్రధానంగా భాజపా-కాంగ్రెస్, జేజేపీ​ మధ్యనే పోరు నడిచే అవకాశం ఉంది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ విశ్వప్రయత్నాలు చేసింది.

ప్రముఖుల పోరు...

ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా- కిలోయ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జేజేపీ నుంచి దుష్యంత్ చౌతాలా, ఐఎన్​ఎల్​డీ నుంచి అభయ్ సింగ్ చౌతాలా తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు.

హరియాణా శాసనసభ ఎన్నికల సమరంలో భాజపా ముగ్గురు క్రీడాకారులను బరిలోకి దింపింది. దాద్రి నియోజకవర్గం నుంచి రెజ్లర్ బబితా ఫొగాట్, సోనిపట్‌లోని బరోడా నుంచి యోగేశ్వర్ దత్, పెహోవా నుంచి హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌ను బరిలో నిలిపింది.

2014లో...

2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 47 చోట్ల గెలుపొందింది. ఆ తర్వాత జింద్‌ ఉప ఎన్నిక నెగ్గి బలాన్ని 48కి పెంచుకుంది. ఐఎన్​ఎల్​డీకి 19, కాంగ్రెస్‌కు 17 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్‌ ఒక్కో చోట నెగ్గాయి. ఐదు చోట్ల స్వతంత్రులు గెలిచారు.

ఇదీ చూడండి : హరియాణా: ఎన్నికలను శాసించే స్థితిలో యువ ఓటర్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Old Trafford, Manchester, England, UK. 20th October 2019.
++CLIENT NOTE. THIS IS A FAST FILE EDIT - FURTHER SOUNDBITES TO FOLLOW IN ADDITIONAL EDIT ++
1. 00:00 SOUNDBITE: (English) Ole Gunnar Solskjaer, Manchester United manager:
"I'm disappointed on behalf of the players, because I thought the effort they put in, and the fans of course, they deserved more than the one point. I felt. And when it's towards the end of the game it feels worse as well. They put us under pressure towards the end but I didn't feel they created too many chances. We soaked the pressure up really well, one lack of concentration and it's a goal. And that's the level we're at."
SOURCE: Premier League Productions
DURATION: 00:35
STORYLINE:
Manchester United manager Ole Gunnar Solskjaer said he was "disappointed" by his side's 1-1 draw against Liverpool in the Premier League on Sunday, insisting they "deserved more than one point", despite bringing Liverpool's 17-game winning streak in the league to an end.
Last Updated : Oct 21, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.