జననం నుంచి మరణం వరకు 16 రకాల సంస్కారాలు ఉంటాయి.. హిందూధర్మంలో. వాటిని నిర్వహించే పురోహితులకు పురాతన కాలం నుంచీ ప్రత్యేక స్థానం ఉంది. తీర్థ గురువులైన బ్రాహ్మణులు అన్నిరకాల సంస్కారాలు జరిపిస్తారు. తరతరాలుగా వాళ్ల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలు జరిపించడంలో నిమగ్నమయ్యారు. హరిద్వార్‌లో పీఠం స్థాపించిన పూర్వీకుల తర్వాతి తరాలే తీర్థ పురోహితులుగా పేరుగాంచారు.
"ఈ పుస్తకాలు పురోహితుడి గుర్తింపు. మేం చేసే పౌరోహిత్య కార్యక్రమాల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ బహీ ఖాతాలు ఓ మనిషి బయోడేటా లాంటివి. పురోహితులు ఉండే ప్రాంతాలు బట్టి, ఆయా ప్రాంతాల ప్రజల బహీలు తయారుచేస్తారు. ఆ బహీని యాత్రికులకు చూపించి, వాళ్లు ఒప్పుకుంటే, మేం వాళ్ల పండితుడి కింద లెక్క. "
-శైలేష్ మోహన్, తీర్థ పురోహితుడు
హిందూధర్మం ప్రకారం 7 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో హరిద్వార్ ఒకటి. మోక్షం పొందేందుకు ఎన్నో సంస్కారాలు ఈ నగరంలో నిత్యం జరుగుతాయి. తమ వంశమూలాలు తెలుసుకోవాలని అనుకునే ఎంతోమందికి ఇవి ఓ మార్గం చూపుతాయి కూడా.
" పూర్వీకుల ఆస్తిగానే ఇది మాకు దక్కుతుంది. మా పెద్దలు మాకిచ్చే వారసత్వం ఇది. హరిద్వార్ ఓ పుణ్యక్షేత్రం. మా పూర్వీకులు దీన్ని పర్యటక స్థలంగా చూశారు. ఇక్కడ వాళ్లు ఇంతకుమించి ఏమీ కూడబెట్టలేదు. పర్యటకస్థలంలో ఇంటివాడు ఉండకూడదని వాళ్లు నమ్మేవారు."
-శైలేష్ మోహన్, తీర్థ పురోహితుడు
ప్రతి తీర్థ పురోహితుడూ వివిధ ప్రాంతాలు, గోత్రాలు, కులాలకు కార్యక్రమాలు జరిపిస్తాడు. ప్రస్తుతం హరిద్వార్‌లో రెండున్నర వేల వరకూ తీర్థ పురోహితులున్నారు. వారికి ఉండే విలువైన ఆస్తి రికార్డు పుస్తకాలే. దానికి వాళ్లు ఎంత ప్రాధాన్యం ఇస్తారంటే...కోర్టుల్లో ఈ పుస్తకాలపై చేసే ప్రమాణం చెల్లుతుంది.
" ఈ పుస్తకాన్ని వంశచరిత్రగా పరిగణిస్తారు. 200 నుంచి 300 ఏళ్ల నాటి వంశస్థుల వివరాలు అన్నీ వీటిలో ఉంటాయి. కోర్టులోనూ ఈ రికార్డులు చెల్లుతాయి. కుటుంబ కలహాల్లో ఈ బాహీలు సాక్ష్యాధారాలుగా ఉంటాయి."
-శ్రీకాంత్ వశిష్ట, తీర్థపురోహితుడు
ప్రతి తీర్థపురోహితుడూ తాను పూజ జరిపించే వినియోగదారుల పేర్లు, వారి వంశచరిత్ర, పూర్వీకుల పేర్లు, స్వస్థలాలు, గోత్రాలు, కులాలు లాంటి వివరాలన్నీ పుస్తకంలో పొందు పరుస్తారు. ఈ పరంపర వందల ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకవేళ వంశంలో అబ్బాయి లేకపోతే అమ్మాయి పేరు రాసుకుంటారు.
" ఒకవేళ ఓ జంటకు కుమారుడు లేకపోతే.. ఆ దంపతుల ఆస్తి మొత్తం కుమార్తెకే చెందుతుంది. ఆ ఆస్తి అమ్మాయి ఇంటికి వెళ్తుంది. దాని బాధ్యత అల్లుడు చూసుకుంటాడు."
-రాఘవేంద్ర శాస్త్రి, తీర్థ పురోహితుడు
మామూలు పుస్తకంలా కనిపించే తీర్థ పురోహితుడి రికార్డు పుస్తకం... లక్షల విలువ చేస్తుంది. ఓ పురోహితుడి వార్షికాదాయం బట్టి, అతడి పుస్తకానికి విలువ కడతారు.
ఇదీ చదవండి : బంధాలను బజారున పడేసిన.. ఓ కసాయి తల్లి కథ ఇది!