పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
హార్దిక్ నియామకాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. గుజరాత్లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా.. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు హార్దిక్. ఈ నేపథ్యంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని గుజరాత్ కాంగ్రెస్ శాఖ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందే పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
'చిత్తశుద్ధితో పనిచేస్తా'
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అనంతరం.. తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పారు హార్దిక్. ప్రజల విశ్వాసం మేరకు కృషి చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రధానంగా రైతులు, నిరుద్యోగ యువతపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు?'