ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉన్నట్లు సోనియా తెలిపారు. జైలు నుంచి విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపిన చిదంబరం.. గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
"సుప్రీం కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసినందుకు సంతోషంగా ఉంది. 106 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలై స్వేచ్ఛా వాయువు పీల్చుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది."
-చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత.
సోనియాతో సమావేశంలో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సైతం ఆయన వెంట ఉన్నారు.
ఇదీ చదవండి: 106 రోజుల నిరీక్షణ.. తిహార్ జైలు నుంచి చిదంబరం రిలీజ్