ETV Bharat / bharat

ఏప్రిల్ 14తో లాక్​డౌన్​ ముగుస్తుందా?

author img

By

Published : Apr 5, 2020, 5:20 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం విధించిన లాక్​డౌన్​ ఏప్రిల్​ 14తో ముగియనుంది. అయితే వైరస్​ కేసులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగిస్తారా? లేక విడతల వారిగా ఆంక్షలను ఎత్తివేస్తారా? కేంద్రం ఏం చేయనుంది?

LOCKDOWN
లాక్​డౌన్​ ఏప్రిల్ 14తో ముగుస్తుందా?
లాక్​డౌన్​ ఏప్రిల్ 14తో ముగుస్తుందా?

21 రోజుల లాక్​డౌన్​లో సగం రోజులు గడిచిపోయాయి. కొన్ని రాష్ట్రాలు, రైల్వే, విమానయాన సంస్థలు ఏప్రిల్​ 15 నుంచి లాక్​డౌన్​ ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉమ్మడి​ నిష్క్రమణ వ్యహాన్ని సిద్ధం చేసింది కేంద్రం. ఈ వ్యూహం ద్వారా కరోనా కేసులును త్వరగా గుర్తించి ​ఆ ప్రాంతాలు ఏవో తెలుసుకోగలిగింది ప్రభుత్వం. దీని ద్వారా వైరస్​ వ్యాప్తి గొలుసును అడ్డుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధించగలిగింది.

తిరిగి పట్టాలెక్కనున్నాయి!

దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా మార్చి 25 నుంచి రద్దు చేసిన రైల్వే సర్వీసులను తిరిగి విడతల వారిగా పునరుద్ధరించేందుకు మొత్తం 17 రైల్వేజోన్​లు, డివిజన్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అయితే పాసింజర్​ సర్వీసుల పునరుద్ధరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ రైల్వే అధికారి తెలిపారు.

విమాన సర్వీసులు...

ఏప్రిల్​ 15 నుంచి టికెట్​ బుకింగ్స్​ ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్​ఆసియా ఇండియా ప్రకటించింది. అయితే డీజీసీఏ ఇచ్చే తాజా మార్గదర్శకాలను బట్టి ఎప్పుడైన నిర్ణయంలో మార్పు ఉండవచ్చని స్పష్టం చేసింది.

చాలా విమానయాన సంస్థలు ఇప్పటికే ఏప్రిల్​ 15 నుంచి టికెట్​ బుకింగ్స్​ ప్రారంభించాలని నిర్ణయించాయి.

ప్రధాని సంకేతాలు...

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​పై పలు కీలక సూచనలు చేశారు.

ఏప్రిల్​ 14 తర్వాత లాక్​డౌన్​లో అంచెలంచెల సడలింపులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రధాని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు 100కు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో ఏప్రిల్​ 14 తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేతపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. లాక్​డౌన్​ను విడతల వారిగా ఎత్తివేసేందుకు చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే వైరస్​ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలవుతాయని స్పష్టం చేశారు.

అయితే ప్రజలు నిబంధనలు పాటించకపోయినా, కేసులు పెరిగినా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ ఏప్రిల్​ 15 నుంచి ఎత్తివేయకపోవచ్చని తెలిపింది.

ఉమ్మడి వ్యూహం...

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఉమ్మడి నియంత్రణ వ్యూహం అమలు చేస్తోంది. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, లద్దాఖ్​లలో వైరస్​ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

మన దేశంలో జనాభా అధికంగా ఉండటం వల్ల కరోనా వైరస్​ విస్తరిస్తే ప్రమాదమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కరోనా ప్రభావం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకంగా లేకపోవటం వల్ల అధికంగా ఉన్న చోట్ల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉమ్మడి వ్యూహంలో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.