ETV Bharat / bharat

అపాచీకి దీటుగా స్వదేశీ మిలిటరీ హెలికాప్టర్! - Hindustan Aeronautics Ltd

రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది భారత్​. అందులో భాగంగా అపాచీ హెలికాప్టర్లకు దీటుగా స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య స్థాయి మిలిటరీ చాపర్​లను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది హెచ్​ఏఎల్​. ప్రభుత్వ అనుమతులు ఈ ఏడాది లభిస్తే 2027 నాటికి తొలి చాపర్​ తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

HAL finalises plan to produce military helicopter
అపాచీకి దీటుగా స్వదేశీ మిలిటరీ హెలికాప్టర్!
author img

By

Published : Mar 1, 2020, 7:36 PM IST

Updated : Mar 3, 2020, 2:13 AM IST

ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తోన్న అపాచీ హెలికాప్టర్లకు ఏమాత్రం తీసిపోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో లోహ విహంగాలను తయారు చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​). అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియను ప్రారంభించింది. 2027 నాటికి సుమారు 10-12 టన్నుల బరువైన తొలి మధ్య స్థాయి మిలిటరీ హెలికాప్టర్​ను తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది.

ఈ మేరకు హెలికాప్టర్ల తయారీపై కీలక విషయాలు వెల్లడించారు హెచ్​ఏఎల్​ ఛైర్మన్​ ఆర్​ మాధవన్​.

" రానున్న రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా విలువైన మిలిటరీ హెలికాప్టర్ల దిగుమతులను తగ్గించుకోవటమే ఈ మెగా ప్రాజెక్ట్​ లక్ష్యం. చాపర్​ ప్రాథమిక డిజైన్​ను ఇప్పటికే రూపొందించాం. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతులు ఇస్తే.. 2023 నాటికి నమూనా చాపర్​ తయారు చేయాలనుకుంటున్నాం. మొత్తం 500 యూనిట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. హెలికాప్టర్​ డిజైన్​తో పాటు నమూనా చాపర్​ రూపొందించేందుకు సుమారు రూ.9,600 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ఈ ఏడాదిలోనే అనుమతులు లభిస్తే.. 2027 నాటికి తొలి చాపర్​ను తయారు చేస్తాం. "

- ఆర్​. మాధవన్​, హెచ్​ఏఎల్​ ఛైర్మన్​, ఎండీ

ట్విన్​ ఇంజిన్​​..

హెచ్​ఏఎల్​ తయారు చేయబోయే మధ్య స్థాయి మిలిటరీ హెలికాప్టర్​ ట్విన్​ ఇంజిన్లతో పనిచేస్తుంది. నౌకలపై దిగేందుకు వీలుగా రెక్కలు మలుచుకునే సౌకర్యం, అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటుంది. వైమానిక దాడులను ఎదుర్కొనే విధంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో సేవలందిస్తోన్న ఎంఐ-17 హెలికాప్టర్లను 2032 నాటికి నిలిపివేయనున్నారు. అయితే వాటి స్థానాన్ని ఈ విహంగాలు భర్తీ చేయనున్నాయి.

ప్రస్తుతం బోయింగ్​ సంస్థ నుంచి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తోంది భారత్​. ఈ మేరకు స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభమైతే దిగుమతులపై ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి: రక్షణ ఒప్పందాల్లో రష్యా, పోలాండ్​ను వెనక్కి నెట్టిన భారత్​!

Last Updated : Mar 3, 2020, 2:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.