ETV Bharat / bharat

రక్షణ ఒప్పందాల్లో రష్యా, పోలాండ్​ను వెనక్కి నెట్టిన భారత్​!

ఐరోపా దేశాలతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో రష్యా, పోలాండ్​ను వెనక్కి నెట్టింది భారత్​. అర్మెనియాకు ఆయుధాలను గుర్తించే రాడార్లను అందించేందుకు సుమారు 40 మిలియన్​ డాలర్లతో ఒప్పందం చేసుకుంది.

author img

By

Published : Mar 1, 2020, 6:46 PM IST

Updated : Mar 3, 2020, 2:07 AM IST

India beats Russia
రక్షణ ఒప్పందాల్లో రష్యాను వెనక్కి నెట్టిన భారత్​!

రక్షణ ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయటంలో భారత్​ దూసుకెళ్తోంది. ఐరోపా దేశాలతో భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవటంలో రష్యా, పోలాండ్​ దేశాలను వెనక్కి నెట్టింది. అర్మెనియా దేశానికి ఆయుధాలను గుర్తించే 4 రాడార్​ వ్యవస్థలను అందించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం భారత్​కు 40 మిలియన్ డాలర్లు చెల్లించనుంది అర్మెనియా.

" ఐరోపాలోని అర్మెనియాకు ఆయుధాలు గుర్తించే 4 స్వాతి రాడార్లను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ రాడార్లను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేయగా.. భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ (బీఈఎల్​) తయారు చేసింది. అర్మెనియాకు ఆయా సామగ్రిని అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మేక్​ ఇన్​ ఇండియా కార్యక్రమంలో ఇది గొప్ప విజయమనే చెప్పాలి. "

- ప్రభుత్వ వర్గాలు

రష్యా, పోలాండ్​ దేశాల రాడార్​ వ్యవస్థలను ముందుగా పరిశీలించిన అర్మెనియన్​ దేశం.. వాటిని కాదని భారత్​ రూపొందించిన రాడార్​లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు.

50 కిలోమీటర్ల పరిధిలో

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వాతి రాడార్​ వ్యవస్థ.. 50 కిలోమీటర్ల పరిధిలో శత్రుమూకల మోర్టార్​ షెల్స్​, రాకెట్స్​ వంటి ఆయుధాలను వేగంగా, స్వయంచాలితంగా వాటి కచ్చితమైన స్థానాలను గుర్తిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వేరు వేరు ఆయుధాల నుంచి పేలిన బాంబులను ఒకేసారి గుర్తించగలదు.

ప్రస్తుతం ఇదే రాడార్​ వ్యవస్థను పాకిస్థాన్​ దాడులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం వినియోగిస్తోంది.

ఇదీ చూడండి: 3 పరోటాలు తింటే రూ.లక్ష ప్రైజ్.. జీవితాంతం భోజనం ఫ్రీ!

Last Updated : Mar 3, 2020, 2:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.