ETV Bharat / bharat

'కశ్మీర్​లో ఉగ్రవాదానికి కారణం గుప్కర్​ కూటమే'

author img

By

Published : Nov 24, 2020, 4:45 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదానికి కారణం గుప్కర్​ కూటమని ఆరోపించారు భాజపా జాతీయ ప్రతినిధి షా​నవాజ్​ హుస్సేన్​. ఆర్టికల్​ 370తో వారు లబ్ధి పొంది, అమాయకులను మోసం చేశారని మండిపడ్డారు.

Gupkar gang responsible for militancy in J&K: Shahnawaz Husain
'కశ్మీర్​లో ఉగ్రవాదానికి కారణం గుప్కర్​ కూటమే'

ఆర్టికల్​ 370 పేరుతో జమ్ముకశ్మీర్​లోని అమాయకులను గుప్కర్​ కూటమి సభ్యులు మోసం చేశారని ఆరోపించారు భాజపా జాతీయ ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి షా​నవాజ్​ హుస్సేన్​. ఆర్టికల్​ 370ని ఉపయోగించుకుని నేతలు ధనికులయ్యారని విమర్శించారు. స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించి.. తమ బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారని మండిపడ్డారు.

"ఇక్కడ ఎవరైనా చనిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడి యువత చేతిలో తుపాకుల బదులు కలాన్ని చూడాలని భాజపా భావిస్తోంది. కానీ.. వేర్పాటువాదులైన కాంగ్రెస్​, ఎన్​సీ, పీడీపీ నేతలు యువత చేతిలో తుపాకులు చూడాలనుకుంటున్నారు. కశ్మీర్​లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఈ గుప్కర్​ కూటమే."

--- షా​నవాజ్​ హుస్సేన్​, భాజపా జాతీయ ప్రతినిధి.​

జమ్ముకశ్మీర్​ యువత ఉగ్రవాదాన్ని వీడి, కలం పట్టుకుని వారి భవితను వారే రాసుకునే విధంగా ప్రోత్సహించడమే భాజపా మిషన్​ అని పేర్కొన్నారు హుస్సేన్​. అన్ని మతాల వారిని కలుపుకొని ముందుకు కదిలే పార్టీ భాజపా ఒక్కటేనని వెల్లడించారు.

ఇదీ చూడండి:- ఫరూక్ అబ్దుల్లా 'రోష్ని'​ భూములపై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.