దక్షిణ కశ్మీర్ షోపియాన్‌లో కొందరు సాయుధ దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. జె అండ్ కె బ్యాంక్‌కు చెందిన వాహనంపై తుపాకులతో దాడిచేసి.. తలుపులు బద్దలు కొట్టారు. అందులోని సొమ్ముతో ఉడాయించారు.
దోపిడీ సమయానికి వ్యానులో సుమారు రూ. 60 నుంచి రూ. 80లక్షల నగదు ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలో ఉగ్రవాదులు ఇదే తరహాలో బ్యాంకులపై దాడులు చేసి, నగదు దోచుకెళ్లారు. ఇది కూడా వారి పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: కశ్మీర్: 30 ఏళ్లలో 5 వేలకు పైగా రాజకీయ హత్యలు