పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ స్పష్టం చేశారు.
గుజరాత్లో సోమవారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ. 71.88గా ఉండగా డీజిల్ ధర రూ 70.12గా ఉంది. తాజాగా.. పెరిగిన రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 73.88, రూ 72.12లుగా మారనున్నాయి.
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయ మార్గాలు సన్నగిల్లాయని తెలిపిన నితిన్.. ఇందులో భాగంగానే చమురు ధరలను పెంచినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఎస్బీఐ కార్డ్ వినియోగదారులకు ఇక వీకేవైసీ