'మోదీ పేరున్న వారందరూ దొంగ'లంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై పశ్చిమ సూరత్ ఎమ్మెల్యే పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు జూన్ 7న కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం రాహుల్‌ను ఆదేశించింది.
రాహుల్ వ్యాఖ్యలు మోదీ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టుకు విన్నవించారు.
"మోదీ అనే ఇంటిపేరుతో చాలామంది ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యల ప్రకారం మోదీలందరూ దొంగలా? ఆ పేరు ఉన్నవారి కీర్తికి రాహుల్ భంగం కలిగించారు. అందుకే మేం పిటిషన్ వేశాం."
-పూర్ణేశ్ మోదీ, పశ్చిమ సూరత్ ఎమ్మెల్యే
ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం వేసిన పరువు నష్టం దావాపై సూరత్ మేజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా.. రాహుల్‌కు సమన్లు పంపారు.
అమిత్‌షా విషయంలోనూ..
'భాజపా అధ్యక్షుడు అమిత్‌షా.. హత్యకేసులో నిందితుడం'టూ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్‌కు బుధవారం సమన్లు అందాయి. ఓ భాజపా కార్యకర్త వేసిన పరువు నష్టం దావాపై అహ్మదాబాద్ కోర్టు ఈ సమన్లను జారీ చేసింది.
ఇదీ చూడండి: 'ఉదయం 5 నుంచి పోలింగ్ నిర్వహించలేరా?'