ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర తర్వాత ఆ స్థాయిలో గుజరాత్ అహ్మదాబాద్ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ వాదనలు సహా పూరీ రథయాత్రపై సుప్రీం కోర్టు స్టేను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయామూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రథయాత్రకు సంబంధించిన అన్నిరకాల మతపరమైన, సెక్యులర్ కార్యక్రమాలపై స్టే విధించింది.
8 లక్షల మందికిపైగా..
అహ్మదాబాద్లో జరిగే జగన్నాథుడి రథయాత్ర 18 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. సుమారు 7-8 లక్షల మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటారని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. భారీ స్థాయిలో జనాలు గుమిగూడటంపై ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ ఏడాది రథయాత్రపై స్టే విధించింది.
ఇదీ చూడండి: 'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'