గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం తనను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా లక్షణాలు లేనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి అశ్వినీ కుమార్ వెల్లడించారు. వారం రోజులపాటు ఎవరినీ ముఖ్యమంత్రి నివాసానికి అనుమతించమని తెలిపారు. రుపానీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్, ఫోన్ల ద్వారా అందుబాటులోనే ఉంటారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశమయ్యారు. సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదవాలాకు కరోనా సోకగా రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే సీఎంకు కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు.
ఇదీ చూడండి:- ఆ కరోనా మృతులంతా భోపాల్ దుర్ఘటన బాధితులే