ETV Bharat / bharat

గుజరాత్​లో నలుగురికి కొత్త రకం కరోనా​ - స్ట్రెయిన్​

దేశంలో కరోనా కొత్తరకం స్ట్రెయిన్​ విస్తరిస్తోంది. బ్రిటన్​ నుంచి అహ్మదాబాద్​కు వచ్చిన నలుగురికి ​పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్​కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

GJ-VIRUS-LD UK STRAIN
గుజరాత్​లో నలుగురికి స్ట్రెయిన్​
author img

By

Published : Jan 2, 2021, 6:15 PM IST

గుజరాత్​లో నాలుగు కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. అహ్మదాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్​ నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించగా వీరికి పాజిటివ్​గా తేలింది.

బ్రిటన్​ నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో నలుగురికి కరోనా(స్ట్రెయిన్​) నిర్ధరణ అయింది. ఇతర ప్రయాణికుల వివరాలను కూడా సేకరిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని నిబంధనల ప్రకారం ఐసోలేషన్​కి తరలించాం.

-జయంతి రవి, గుజరాత్​ వైద్య ఆరోగ్య ప్రధాన కార్యదర్శి

స్ట్రెయిన్​ విజృంభణ నేపథ్యంలో భారత్​-బ్రిటన్​ల మధ్య విమానాల రాకపోకలను జనవరి 8వరకు నిషేధిస్తున్నట్టు కేంద్ర విమానాయాన శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చదవండి: 'భాజపా వ్యాక్సిన్​ను తీసుకునే ప్రసక్తే లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.