ETV Bharat / bharat

'ట్రాన్స్​జెండర్ల హోటల్'​లో ఆహా ఏమి రుచి! - కోయంబత్తూర్​ ట్రాన్స్​జెండర్స్​

ఓ ట్రాన్స్​జెండర్ల బృందం.. కోయంబత్తూర్​లో హోటల్​ తెరిచింది. దానికి కోవై ట్రాన్స్ కిచెన్​​ అని పేరు పెట్టి రుచికరమైన వంటలను అందిస్తోంది. ట్రాన్స్​జెండర్లు యాచించడం మాని.. సొంత కాళ్లపై నిలబడాలని ఈ బృందం సందేశాన్ని పంపిస్తోంది.

Group of transgenders open eatery in Coimbatore
నోరూరించే ఆహారానికి అడ్డా ఈ 'కోవై ట్రాన్స్​ కిచెన్​'
author img

By

Published : Sep 9, 2020, 7:01 PM IST

తమిళనాడులోని కోయంబత్తూర్​లో.. 'కోవై ట్రాన్స్​ కిచెన్​' పేరుతో హోటల్​ తెరిచింది ఓ ట్రాన్స్​జెండర్ల బృందం. ఎన్నో రుచికరమైన వంటలను అందిస్తోంది.

Group of transgenders open eatery in Coimbatore
నోరూరించే ఆహారానికి అడ్డా ఈ 'కోవై ట్రాన్స్​ కిచెన్​'

తమ లాంటి వారు యాచించడం మాని.. సొంత కాళ్ల మీద నిలబడటం అలవాటు చేసుకోవాలని అన్నారు కోయంబత్తూర్​ ట్రాన్స్​జెండర్స్​ అసోసియేషన్​ చీఫ్​ సంగీత. ఇదే తరహాలో మరో తినుబండారాల విక్రయ కేంద్రం తెరవనున్నట్టు తెలిపారు.

ఈ హోటల్​కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

"నేను సాధారణంగా దక్షిణ భారతంలో పర్యటిస్తూ ఉంటాను. అప్పుడే ఈ హోటల్​ గురించి తెలిసింది. నేను భోజన ప్రియుడిని. రుచికరమైన ఆహారాన్ని అందించడం సహా ట్రాన్స్​జెండర్లకు వీరు ఉద్యోగాన్ని ఇస్తున్నారు. ఇది ఎంతో మంచి విషయం."

--- కోయంబత్తూర్​ వాసి.

హోటల్​ను నిర్వహిస్తున్న ట్రాన్స్​జెండర్లను సామాజిక కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడ్డ వారికి ఇది మంచి ప్రారంభమని అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి:- ట్రాన్స్​జెండర్ల సమానత్వం కోసం జాతీయ మండలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.