ప్రపంచ అవసరాలకు తగ్గట్టు శ్రామిక శక్తిని తయారు చేసేలా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా దేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని, అందుకు తగ్గ మానవ వనరులను కూడా తయారు చేస్తామని తెలిపారు. 'కైసల్యాచార్య సమాదర్' కింద 92 మంది వివిధ రంగాల శిక్షకులకు గురువారం పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్బంగా ప్రధాని పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. నిపుణులైన యువత కోసం ఎన్నో రంగాలు ఎదురుచూస్తున్నాయని, ఈ అవకాశాన్ని అందరూ అందుకోవాలని కోరారు. నైపుణ్య శిక్షణ శాఖ సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నిపుణులను తయారు చేయడానికి శిక్షకులు కొత్త మార్గాలను అన్వేషించాలని కోరారు.
ఇదీ చూడండి: చైనీయులపై కన్నేసిన భారత్.. ఆ శిఖరాలన్నీ మనవే!