ETV Bharat / bharat

'ప్యాకేజీ పేరుతో రూ.1.86 లక్షల కోట్లు విదిల్చారు' - కరోనా ప్యాకేజీ నిరాశాజనకంగా ఉందన్న చిదంబరం

మోదీ ప్యాకేజీపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి రూ.1.86 లక్షల ​కోట్లు మాత్రమే విదిల్చారని ఆరోపించారు. అంటే జీడీపీలో 0.91 శాతం మాత్రమే ఉద్దీపన ప్రకటించారని, ఇది ఎందుకూ సరిపోదన్నారు.

Chidambaram
మోదీ ప్యాకేజీ పూర్తి నిరాశాజనకం
author img

By

Published : May 18, 2020, 2:26 PM IST

Updated : May 18, 2020, 3:25 PM IST

మోదీ సర్కార్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ నిరాశాజనకంగా, ఎందుకూ సరిపోని విధంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి కేవలం రూ.1.86 లక్షల ​కోట్లు విదిల్చారని, ఇది జీడీపీలో 0.91 శాతం మాత్రమేనని ఆయన ఆరోపించారు.

నిరాశాజనకం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో... పేదలు, వలసదారులు, రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులు, మధ్యతరగతి ప్రజలకు సరైన కేటాయింపులు చేయలేదని చిదంబరం అన్నారు.

"నేను పూర్తిగా నిరాశ చెందాను. ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్​ను కాస్త మెరుగ్గా సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదనంగా మరో రూ.10 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాను."

- పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి

అవకాశవాదం..

మోదీ ప్రభుత్వం పలు అంశాలను పార్లమెంట్​లో చర్చకు రాకుండా చేస్తోందని, అలాగే ప్యాకేజీని కూడా చర్చకు రాకుండా దాటవేయడానికి ప్రయత్నిస్తోందని చిదంబరం ఆరోపించారు. ఇది పచ్చి అవకాశవాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉద్దీపన ప్యాకేజీపై చర్చించడానికి కనీసం పార్లమెంటరీ కమిటీ సమావేశం అయినా జరగాలి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్​ను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది."

- పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి

కరోనా సంక్షోభాన్ని అధిగమించి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు జీడీపీలో 10 శాతాన్ని (రూ.20 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ఇదీ చూడండి: ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్రదేశాల సరసన భారత్​!

Last Updated : May 18, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.