పార్లమెంట్లో ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్పై రాజకీయ రగడ కొనసాగుతోంది. వారందరిపై ఉన్న వేటును తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాయి. అయితే ఎంపీలు క్షమాపణలు చెబితేనే.. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు.
"తమ ప్రవర్తన పట్ల ఆ ఎనిమిది మంది ఎంపీలు క్షమాపణలు చెబితేనే.. వారిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తాం. రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరును కాంగ్రెస్ తప్పుబడుతుందని ఆశిస్తున్నాం."
--- రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు రవిశంకర్. అమెరికా నుంచి ట్వీట్లు వస్తే.. ఎంపీలు ఈ విధంగా ప్రవర్తించడమేంటని, అసలు ఇవేమి రాజకీయాలని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం వద్ద అవసరమైన మెజారిటీ ఉందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి.
ఇదీ చూడండి:- నిత్యావసర వస్తువుల బిల్లుకు ఆమోదం