దేశంలో రైళ్లు, విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. వీటిపై జరిగిన చర్చలు కూడా ఎలాంటి ఫలితాలు లేకుండానే ముగిశాయని స్పష్టం చేశారు.
"ఏదో ఒకరోజు రవాణా వ్యవస్థ పునరుద్ధరణ జరగాల్సిందే. అయితే అది ఏ రోజు అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు వాటిపై చర్చలు జరిపినా లాభం లేదు. ఎందుకంటే పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాం."
-- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి.
మే 4 నుంచి కొన్ని విమానయాన సంస్థలు దేశీయ సర్వీసులు ప్రారంభించనున్నట్టు చేసిన ప్రకటనపైనా జావడేకర్ స్పందించారు. వారి ప్రకటనలతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయంపై పౌరవిమానయాన శాఖ ఇప్పటికే స్పష్టతనిచ్చిందన్నారు. సంస్థలు తమ సొంత నిర్ణయాలు తీసుకున్నాయని వివరించారు జావడేకర్.
లాక్డౌన్ నేపథ్యంలో మే 3 వరకు ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- ఆ ఆసుపత్రిలో 21 మంది వైద్య సిబ్బందికి కరోనా