ETV Bharat / bharat

టీకా పంపిణీపై స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు! - కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ వేగంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. మరికొన్ని నెలల్లో టీకా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో శీతల గిడ్డంగులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం ప్రభుత్వం విభాగాలతో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ప్రైవేటు సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతోంది జాతీయ నిపుణలు బృందం.

VIRUS-VACCINE STORAGE PLAN
వ్యాక్సిన్​
author img

By

Published : Oct 8, 2020, 5:02 PM IST

మరికొద్ది నెలల్లో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. టీకాను నిల్వ చేసి, క్షేత్రస్థాయిలో త్వరగా పంపిణీ చేసేందుకు కోల్డ్ చైన్ స్టోరేజీ సదుపాయాలను గుర్తించే పనిలో పడింది.

ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ అధీనంలోని పలు రంగాల సంస్థలతో జాతీయ నిపుణుల బృందం చర్చలు జరుపుతోంది. ఇందులో ఫార్మా, ఆహార శుద్ధి, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలతో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్​ డెలివరీ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా తాలుకా స్థాయిలో శీతల గిడ్డంగులు, ఫ్రిడ్జ్​లను గుర్తించే పనిని ముమ్మరం చేసింది.

వచ్చే వారంలోనే ప్లాన్​..

మరికొన్ని నెలల్లో కనీసంగా ఒక దేశీయ వ్యాక్సిన్​, మూడు విదేశీ వ్యాక్సిన్లు భారత్​లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్​ పంపిణీకి సంబంధించి ముసాయిదా పథకాన్ని వచ్చే వారంలో ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

శీతల గిడ్డంగుల సామర్థ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. 40 నుంచి కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు భారత్​కు వచ్చే అవకాశం ఉందని, 2021 జులై నాటికి 25 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

ప్రత్యేక పరిస్థితుల్లో నిల్వ..

టీకా క్యాండిడేట్ల పంపిణీకి శీతల గిడ్డంగుల సరఫరా వ్యవస్థ అవసరమవుతుంది. ఉష్ణోగ్రతలు 0 నుంచి -80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండాలి. అయితే చాలా వరకు 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాల్సి వస్తుంది. ఎక్కువ శాతం టీకాలు ద్రవ రూపంలోనే ఉండగా, మరికొన్ని గడ్డకట్టిన స్థితిలో ఉంటాయని తెలుస్తోంది. చాలా వరకు వ్యాక్సిన్లు మల్టీ డోసులుగా ఉంటాయని సమాచారం.

ఆరు నెలల్లోపు జనాభాలో 18 శాతానికి టీకా అందించేలా శీతల గిడ్డంగుల అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రత పరిధులు (+2 నుంచి +8 డిగ్రీల సెల్సియస్, -15 నుంచి -20 డిగ్రీల సెల్సియస్).. రెండు పరిస్థితులలోనూ తగినంత నిల్వ కోసం కేటాయించాల్సి ఉంటుంది. రిఫ్రిజిరేటెడ్​ వ్యాన్ల పెంపు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకు దోహదపడుతుందని తెలిపారు.

ప్రైవేటు స్టోరేజీలతోనూ...

యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) యంత్రాంగం ద్వారా టీకా పంపిణీ చేస్తారు. యూఐపీ కింద 27 వేల కోల్డ్ స్టోరేజీలు ఉండగా.. అందులో 750 (3 శాతం) మాత్రమే జిల్లా స్థాయిలో ఉన్నాయి. అయితే, ప్రైవేటు రంగానికి చెందిన కోల్డ్ స్టోరేజీలను ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.