ఓటీటీల్లో వస్తున్న కొన్ని సీరియళ్లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. దీనిపై రాజ్యసభలో కేంద్ర ప్రసార మంత్రి ప్రకాశ్ జావడేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఓటీటీలకు సంబంధించి మార్గదర్శకాలు దాదాపుగా సిద్దం అయ్యాయి. త్వరలోనే వాటిని అమలు చేస్తాం."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర ప్రసార మంత్రి
ఓటీటీలో అసభ్య పదజాలం, హింసాత్మక, అశ్లీల దృశ్యాలు ఎక్కువయ్యాయని రాజ్యసభలో శూన్య గంటలో భాజపా ఎంపీ మహేశ్ పోద్ధార్ అన్నారు. దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫాంలతో పాటు వందలకొద్ది వార్తా సైట్లపై వెంటనే అంతర్జాల నిబంధనల్ని అమలు చేయాలని కోరారు. ఆయన వాఖ్యలపై జావడేకర్ స్పందించారు. ఓటీటీలకు సంబంధించి చాలా ఫిర్యాదులు, నియంత్రించడానికి సలహాలు అందాయన్నారు. త్వరలోనే ఓటీటీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: త్వరలో 'ఓటీటీ'లకు మార్గదర్శకాలు