ETV Bharat / bharat

'హాథ్రస్​లో యోగి ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తోంది' - హాథ్రస్ ఘటనపై రాహుల్ స్పందన

హాథ్రస్​ హత్యాచార కేసులో నిజాలను దాచేందుకు యూపీ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులపైనా దాడి చేస్తున్నారని, ఈ ప్రవర్తనను ఏ భారతీయుడు అంగీకరించడని అన్నారు.

HATHRAS-RAHUL BJP
రాహుల్ గాంధీ
author img

By

Published : Oct 2, 2020, 7:52 PM IST

హాథ్రస్​ హత్యాచార ఘటనలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజాన్ని కప్పిపెట్టేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం క్రూరమైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను అనాగరికులుగా పరిగణిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు.

HATHRAS-RAHUL BJP
రాహుల్ గాంధీ ట్వీట్

"హాథ్రస్​ నిందితులను రక్షించడానికి ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం క్రూరమైన మార్గాల్లో ప్రయాణిస్తోంది. విపక్షాలను, మీడియాను బాధితురాలి కుటుంబాన్ని కలవకుండా అడ్డుపడుతోంది. వారిని అనాగరికులుగా పరిగణిస్తూ వేధిస్తోంది. ఏ భారతీయుడూ ఇలాంటి చర్యలను సహించబోడు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

బాధితురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు గురువారం హాథ్రస్​కు వెళ్తుండగా... రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు ఆయనను అరెస్ట్​ చేశారు. ​

ఇదీ చూడండి: రాహుల్​, ప్రియాంకపై కేసు- కాంగ్రెస్​ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.