కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉద్యోగాలు, పొదుపుచేసుకున్న సొమ్మును ప్రజల నుంచి సర్కార్ లాక్కుపోతోందని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అయినా తప్పుడు కలలను చూపుతూ ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు.
కరోనా కష్టాల కారణంగా గత 4 నెలల్లో పీఎఫ్ ఖాతాల నుంచి రూ.30వేల కోట్లను ప్రజలు ఉపసంహరించుకున్నారని ఓ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను జత చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు రాహుల్. దీనిని ఆధారంగా చూపుతూ కేంద్రంపై విమర్శలు చేశారు.
-
नौकरी छीन ली, जमा पूँजी हड़प ली, बीमारी भी फैलने से नहीं रोक पाए...
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
मगर वो शानदार झूठे सपने दिखाते हैं।https://t.co/OlId6yfFnU
">नौकरी छीन ली, जमा पूँजी हड़प ली, बीमारी भी फैलने से नहीं रोक पाए...
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2020
मगर वो शानदार झूठे सपने दिखाते हैं।https://t.co/OlId6yfFnUनौकरी छीन ली, जमा पूँजी हड़प ली, बीमारी भी फैलने से नहीं रोक पाए...
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2020
मगर वो शानदार झूठे सपने दिखाते हैं।https://t.co/OlId6yfFnU
" ఉద్యోగాలు పోగొట్టారు. కూడబెట్టిన సంపదను లాక్కున్నారు. కరోనాను కట్టడి చేయలేకపోయారు. కానీ తప్పుడు కలలను మాత్రం చూపుతున్నారు"
-రాహుల్ గాంధీ ట్వీట్