ETV Bharat / bharat

భారత్‌లో చైనా కంపెనీలపై కేంద్రం ప్రకటన - గల్వాన్​ ఘటన

గల్వాన్​ ఘటన అనంతరం.. భారత్​, పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఇప్పటికీ చైనాకు చెందిన 80 కంపెనీలు భారత్​లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.

author img

By

Published : Feb 9, 2021, 9:51 PM IST

సరిహద్దు సమస్యల్ని పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నప్పటికీ చైనా దుందుడుకు వైఖరితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. డ్రాగన్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు గల్వాన్‌ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై శాశ్వత నిషేధం విధించింది. అయితే, ప్రస్తుతం భారత్‌లో.. చైనాకు చెందిన 80 కంపెనీలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

భారత్‌లో వాణిజ్యం చేస్తున్న చైనా కంపెనీల రెగ్యులేషన్‌పై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. దేశంలో 92 చైనా కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయని, ప్రస్తుతం 80 కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయని స్పష్టంచేశారు. తగిన నిబంధనలు రూపొందించామని, అన్ని కంపెనీలూ వాటికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుందని చెప్పారు. రక్షణ, అంతరిక్షం, అణు ఇంధనం సహా కొన్ని కీలక రంగాల్లో మినహా ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ ఎఫ్‌డీఐలకు అనుమతిస్తుందన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో గతేడాది చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ టిక్‌టాక్‌, పబ్‌ జీ సహా చైనా కంపెనీలకు చెందిన 59 యాప్‌లపై కేంద్రం నిషేధించింది. గల్వాన్‌ లోయ వద్ద మన సైన్యంపై చైనా సైనికుల దాడి తర్వాత దేశ భద్రత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత పౌరుల సమాచారం దుర్వినియోగం అరోపణలపై ఆయా సంస్థలకు నోటీసులు జారీచేయగా.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని కేంద్ర ప్రభుత్వం వాటిపై శాశ్వతంగా నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: పాక్​ వెళ్లిన 100 మంది కశ్మీరీ యువత అదృశ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.