ETV Bharat / bharat

'చిన్నమ్మ'కు గుర్తుగా రెండు ప్రభుత్వ సంస్థలకు నామకరణం

రెండు ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలకు కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్​ పేరును పెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. సుష్మా స్వరాజ్ 68వ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయ కేంద్రానికి సుష్మాస్వరాజ్​ భవన్​గా.. విదేశీ సేవల సంస్థకు సుష్మా స్వరాజ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫారెన్​ సర్వీసెస్​గా నామకరణం చేసింది.

Govt renames two prominent institutes after Sushma Swaraj on eve of birth anniversary
'చిన్నమ్మ'కు గుర్తుగా రెండు ప్రభుత్వ సంస్థలకు నామకరణం
author img

By

Published : Feb 13, 2020, 11:42 PM IST

Updated : Mar 1, 2020, 6:41 AM IST

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ సేవల జ్ఞాపకార్థం గౌరవంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రెండు ప్రభుత్వ సంస్థలకు ఆమె పేరు పెట్టి గౌరవించింది. సుష్మా స్వరాజ్​ 68వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది విదేశీ వ్యవహారాల శాఖ.

విదేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ప్రవాస భారత కేంద్రానికి సుష్మాస్వరాజ్​ భవన్​గా నామకరణం చేసింది. అలాగే దౌత్యవేత్తలకు శిక్షణను ఇచ్చే ఫారెన్​ సర్వీసెస్​ సంస్థకు 'సుష్మా స్వరాజ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫారెన్​ స్వరీసెస్'​గా పేరు మార్చింది.

"దౌత్యకార్యాలయానికి, దేశ ప్రజలకు దివంగత నేత సుష్మా స్వరాజ్​ చేసిన నిస్వార్థ సేవలకు గాను రెండు ప్రభుత్వ సంస్థలకు ఆమె పేరును పెట్టాం. ఫిబ్రవరి 14న కేంద్ర మాజీ మంత్రి జయంతిని పురస్కరించుకొని ఆమె గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నాం."

- విదేశాంగ శాఖ ప్రకటన.

చిన్నమ్మ ఔదార్యం...

విదేశాల్లో వివిధ కారణాల వల్ల చిక్కుకుపోయిన ఎంతో మందిని సురక్షితంగా తిరిగి భారత్​కు రప్పించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా భారత్​లో చికిత్స పొందాలనుకున్న ఎంతో మంది పాకిస్థానీయులకు వీసా కల్పించి తన ఔదార్యాన్ని చాటుకుంది.

సాధించిన ఘనతలు...

హరియాణాలో అతి చిన్న వయసులోనే కేబినేట్​ మంత్రి హోదా సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కారు సుష్మా. అంతేకాకుండా దేశంలో ఒక రాజకీయ పార్టీకి మొదటి మహిళా ప్రతినిధిగా, అలాగే దిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేసిన తొలి మహిళగానూ సుష్మాస్వరాజ్​ చరిత్రలో నిలిచారు. 1996లో వాజ్​పేయీ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా.. తిరిగి 1998లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2009-14 వరకు లోక్​సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ప్రభుత్వ విధానాలను ఖండించారు. 7 సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహించారు.

సుష్మా స్వరాజ్​ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా సాధన చేశారు. గత ఏడాది ఆగస్టు 6న గుండె సంబంధిత వ్యాధితో మరణించారు.

ఇదీ చూడండి:మోదీపై అభ్యంతరకర పోస్టు.. వెంకయ్య నాయుడు ఫైర్​​

Last Updated : Mar 1, 2020, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.