దేశంలో గ్రామీణ పారిశుద్ధ్య ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' సర్వేను ప్రారంభించింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాలు, 17,475 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేయనున్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ దిల్లీలో ఈ సర్వేను ప్రారంభించారు. ప్రజలు తమ స్పందన తెలియజేసేందుకు ఓ యాప్ను ఆవిష్కరించారు.
గతంలో చేసిన సర్వే కంటే ఇంది మూడింతలు పెద్దది. 2018 సర్వేలో మొత్తం 6,000 గ్రామాలే భాగమయ్యాయి.
ఎలా చేస్తారు?
87 వేల బహిరంగ ప్రదేశాల్లో 45 రోజుల పాటు పారిశుద్ధ్య ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రతి గ్రామంలోనూ 5 ప్రదేశాలను ఎంచుకుంటారు. సెప్టెంబర్ 30న సర్వే ముగుస్తుంది. రాష్ట్రాలకు, జిల్లాలకు వారి ప్రమాణాలను బట్టి ర్యాంకులను ప్రకటిస్తారు.
- ఇదీ చూడండి: ఆకతాయిల పని పట్టేందుకు 'అమ్మ' సిద్ధం!