జమ్ముకశ్మీర్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనా భూభాగంలో ఉన్నట్లు చూపటాన్ని తప్పుపడుతూ.. ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) జాక్ డోర్సేకు ఘాటు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. భారత చిత్ర పట్టాన్ని తప్పుగా చూపించటంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని హెచ్చరించింది.
దేశ సార్వభౌమత్వం, సమగ్రతను అగౌరవపరిచే ఏ కార్యక్రమం కూడా ఆమోదయోగ్యం కాదని లేఖలో పేర్కొన్నారు ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నే.
" ఇలాంటి చర్యలు ట్విట్టర్‌కు అపఖ్యాతిని కలిగించటమే కాకుండా.. సంస్థపై పలు అనుమానాలను రేకెత్తిస్తాయి. లద్దాఖ్‌కు లేహ్ హెడ్‌క్వార్టర్. లద్దాఖ్, జమ్ముకశ్మీర్ భారత అంతర్గత ప్రాంతాలు. భారత రాజ్యాంగం ద్వారా అక్కడ పాలన సాగుతోంది. భారతీయుల మనోభావాలను గౌరవించాల్సిందే. దేశ సౌర్వభౌమత్వాన్ని అగౌరవపరిచే చర్యలు ఆమోదయోగ్యం కాదు, చట్ట విరుద్ధ కూడా."
- అజయ్ సాహ్నే, ఐటీ శాఖ కార్యదర్శి.
జమ్ముకశ్మీర్‌లోని లేహ్ ప్రాంతాన్ని ట్విట్టర్ చైనా భూభాగంగా చూపించటంపై వివాదం చెలరేగింది. ట్విట్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు నెటిజన్లు. అయితే.. వెంటనే స్పందించిన ట్విట్టర్.. సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంలో నెలకొన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్!