ETV Bharat / bharat

కరోనా టీకా పంపిణీకి మార్గదర్శకాలు విడుదల - కొవిడ్​-19 టీకా పంపిణీకి మార్గదర్శకాలు

దేశంలో కొవిడ్ టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. తొలి విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

guidelines for COVID-19 vaccination drive
టీకా పంపిణీకి మార్గదర్శకాలు విడుదల
author img

By

Published : Dec 14, 2020, 6:26 PM IST

కరోనా మహమ్మారి కట్టడికి త్వరలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్న క్రమంలో పంపిణీకి సన్నద్ధమవుతోంది కేంద్రం. ఈ మేరకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీపై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్​ ప్లాట్​ఫాం కొవిడ్​ వాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​ (కో-విన్​) ద్వారా లబ్ధిదారులు, టీకాల వివరాలను రియల్​ టైమ్​లో ట్రాక్​ చేయనున్నారు.

  • ప్రతి సెషన్​లో 100-200 మందికి టీకా వేయాలి.
  • వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రతికూల ప్రభావం ఉందా అని తెలుసుకునేందుకు 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలి. ఒక్కోసారి ఒక్కరిని మాత్రమే టీకా తీసుకునేందుకు అనుమతించాలి.
  • టీకా పంపిణీ కేంద్రాల్లో ముందస్తుగా నమోదు చేసుకున్న లబ్ధిదారులకే ప్రాధాన్య క్రమంగా టీకా అందించాలి.
  • మొదట ఆరోగ్య సిబ్బంది, ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించాలి.
  • వ్యాక్సిన్​ క్యారియర్లు, నిలువ చేసే బాక్సులు, ఐస్​ ప్యాక్​లు నేరుగా సూర్యరశ్మి తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • లబ్ధిదారుడు టీకా తీసుకునేందుకు కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్​ను క్యారియర్​లోపలే ఉంచాలి.
  • కొవిడ్​ టీకా లేబుల్​పై వ్యాక్సిన్​ వైయల్​ మానిటర్లు(వీవీఎం), గడువు ముగిసే తేదీ ఉండకపోయినా.. అలాంటి వాటిని వినియోగించకుండా పక్కన పెట్టకూడదు. టీకా పంపిణీ ముగిసిన తర్వాత అన్ని ఐస్​ ప్యాక్​లు, తెరవని వ్యాక్సిన్​ బాక్సులను తిరిగి కోల్డ్​ చైన్​ పాయింట్​కు పంపించాలి.
  • వ్యాక్సినేషన్​ గురించి ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

మొదటి విడతలో భాగంగా దేశంలో దాదాపు 30 కోట్ల మందికి కరోనా టీకా వేయాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది.

ఇదీ చూడండి: రూ.24 లక్షల నీటి బిల్లు బాకీపడ్డ సీఎం, మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.