పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కరోనాపై యుద్ధం జరుగుతున్న తరుణంలో.. ధరలను తగ్గించాల్సింది పోయి పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
कोरोनावायरस से जारी लड़ाई हमारे करोड़ों भाइयों और बहनों के लिए गंभीर आर्थिक कठिनाई का कारण बन रही है। इस समय, कीमतें कम करने के बजाय, पेट्रोल और डीजल पर 10-13 ₹ प्रति लीटर कर बढ़ाने का सरकार का निर्णय अनुचित है और इसे वापस लिया जाना चाहिए। pic.twitter.com/yMvYHK12V4
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">कोरोनावायरस से जारी लड़ाई हमारे करोड़ों भाइयों और बहनों के लिए गंभीर आर्थिक कठिनाई का कारण बन रही है। इस समय, कीमतें कम करने के बजाय, पेट्रोल और डीजल पर 10-13 ₹ प्रति लीटर कर बढ़ाने का सरकार का निर्णय अनुचित है और इसे वापस लिया जाना चाहिए। pic.twitter.com/yMvYHK12V4
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2020कोरोनावायरस से जारी लड़ाई हमारे करोड़ों भाइयों और बहनों के लिए गंभीर आर्थिक कठिनाई का कारण बन रही है। इस समय, कीमतें कम करने के बजाय, पेट्रोल और डीजल पर 10-13 ₹ प्रति लीटर कर बढ़ाने का सरकार का निर्णय अनुचित है और इसे वापस लिया जाना चाहिए। pic.twitter.com/yMvYHK12V4
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2020
"కరోనాపై యుద్ధం కారణంగా దేశంలోని కోట్లాది మందికి ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ధరలు తగ్గించాల్సింది పోయి, వాటిని రూ.10-13కు పెంచింది. ఇది అన్యాయం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
లీటరు పెట్రోల్‌పై రూ.10, లీటర్ డిజిల్‌పై రూ.13 మేర ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు.
అయితే ఈ పెంపు వల్ల రీటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల పెరిగిన ఈ ధరలను చమురు కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయి.
'ప్రభుత్వం ఇలా చేయకూడదు...'
దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన తరుణంలో కేంద్రం ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తప్పుబట్టారు. కేంద్రం.. లోటును పూడ్చుకోవడానికి అప్పుచేయాలి కానీ ప్రజలపై సుంకాల భారాన్ని మోపకూడదని అభిప్రాయపడ్డారు.
-
हम सरकार से कब से अनुरोध कर रहे हैं कि देश के आधे निचले लोगों/परिवारों को नकद हस्तांतरण करें। इसके बजाए सरकारें लोगों से सरकार को पैसे का हस्तांतरण करा रही हैं। बहुत निर्दयीहै।
— P. Chidambaram (@PChidambaram_IN) May 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">हम सरकार से कब से अनुरोध कर रहे हैं कि देश के आधे निचले लोगों/परिवारों को नकद हस्तांतरण करें। इसके बजाए सरकारें लोगों से सरकार को पैसे का हस्तांतरण करा रही हैं। बहुत निर्दयीहै।
— P. Chidambaram (@PChidambaram_IN) May 6, 2020हम सरकार से कब से अनुरोध कर रहे हैं कि देश के आधे निचले लोगों/परिवारों को नकद हस्तांतरण करें। इसके बजाए सरकारें लोगों से सरकार को पैसे का हस्तांतरण करा रही हैं। बहुत निर्दयीहै।
— P. Chidambaram (@PChidambaram_IN) May 6, 2020
"ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు డబ్బులివ్వాలి. అంతేకానీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. ఆర్థికంగా కుదేలైన వారికి ప్రభుత్వం సహాయం చేయాలని మేము కోరుతున్నాం. వారికి నగదు బదిలీ చేయాలన్నాం. కానీ కేంద్రం మాత్రం ప్రజల నుంచి నగదు బదిలీ చేయించుకుంటోంది. ఇది ఎంతో క్రూరమైనది."
-- పి. చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇదీ చూడండి:- 'మే 17 తర్వాత ఎలా? ప్రభుత్వం ప్లాన్ ఏంటి?'