ETV Bharat / bharat

20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి నగదు

తొలి విడతలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి రూ.500లను ప్రభుత్వం బదిలీ చేసిందని అధికారులు వెల్లడించారు. లాక్​డౌన్​ కారణంగా ప్రజల ఆర్థిక కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

Govt completes transfer of first installment of Rs 500 to 20 cr women Jan Dhan accounts
తొలి విడతలో జన్​ధన్​ ఖాతాల్లోకి రూ.500
author img

By

Published : Apr 9, 2020, 6:01 AM IST

20 కోట్ల మంది మహిళల జన్​ధన్ ఖాతాల్లోకి తొలి విడతలో భాగంగా రూ.500 బదిలీని ప్రభుత్వం పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతనెలలో ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్లు ఉపశమన ప్యాకేజీలో భాగంగానే ప్రభుత్వం విడుదల చేసింది. లాక్​డౌన్​ కారణంగా ప్రజలు పడే కష్టాలను తగ్గించే లక్ష్యంతో రానున్న మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్​ధన్ ఖాతాల్లోకి రూ.500 నగదు బదలీ చేస్తామని సీతారామన్​ తెలిపారు.

భౌతిక దూరం పాటించి..

డబ్బు, ప్రతీ ఖాతాదారునికి చేరిందని, లబ్ధిదారులు భౌతిక దూరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు తగిన విధంగా నగదు విత్​డ్రా చేసుకోవాలని నిర్మల సూచించారు. భౌతిక దూరం పాటించి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులు నగదు ఉపసంహరించుకొనేలా చూడటానికి, ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ) ఏప్రిల్​ నెలలో అన్ని బ్యాంకులు అనుసరించాల్సిన నిబంధనలు రూపొందించింది.

ఖాతా చివరి అంకె ఆధారంగా..

జన్​ధన్​ ఖాతాల్లో చివరి లబ్ధిదారుని ఖాతా ఆఖరి అంకె ఆధారంగా నగదు ముందు జమ అవుతుంది. 0 లేదా 1తో ముగిసిన ఖాతాదారులకు ఏప్రిల్​ 3న, 2 లేదా 3తో అయితే ఏప్రిల్​ 4న, 4లేదా 5 (ఏప్రిల్​7) 8లేదా9 (ఏప్రిల్​9) ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. మరో రెండు విడతల్లో మే, జూన్​ నెలల్లో నగదు బదిలీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: మహారాష్ట్రలో మరో 117 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.