ETV Bharat / bharat

'ఖరీఫ్​లో 43 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు' - ఖరీఫ్​ సీజన్​

మద్దతు ధరపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్​ సీజన్​లో కనీస మద్దతు ధరకు ఇప్పటి వరకు 43 లక్షల మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం రూ.8032.62 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. పంట ఉత్పత్తుల కొనుగోలుకు ఆయా రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు అనుమతులు జారీ చేశామని, ధరలు తగ్గినప్పటికీ ఎంఎస్​పీకి ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.

Government purchases paddy
వరి ధాన్యం కొనుగోలు
author img

By

Published : Oct 13, 2020, 7:24 AM IST

దేశవ్యాప్తంగా 2020-21 ఖరీఫ్​ సీజన్​ పంట ఉత్పత్తులు మార్కెట్​కు వస్తున్నాయి. ఈ సీజన్​లో ఇప్పటి వరకు 3.57 లక్షల మంది రైతుల నుంచి 42.55 లక్షల మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందు కోసం కనీస మద్దతు ధర కింద రూ. 8032.62 కోట్లు ఖర్చు చేసినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలతో మద్దతు ధరపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ మేరకు ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఖరీఫ్​ మార్కెటింగ్​ సీజన్​లో 30.70 లక్షల మెట్రిక్​ టన్నుల పప్పు దినుసులు, నూనెగింజల కొనుగోలుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా, రాజస్థాన్​, ఆంధ్రప్రదేశ్​లకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అలాగే.. 1.23 లక్షల మెట్రిక్​ టన్నుల కొబ్బరి పంటను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది కేంద్రం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత వాటికి కూడా అనుమతులు ఇస్తామని పేర్కొంది. మార్కెట్​లో ధరలు తగ్గినప్పటికీ.. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

అక్టోబర్​ 11 వరకు కేంద్ర ప్రభుత్వం.. తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలలో 533 మంది రైతుల నుంచి రూ.4.36 కోట్ల ఎంఎస్​పీతో 6.6.56 మెట్రిక్​ టన్నుల పెసర్లు, మినుములు కొనుగోలు చేసింది. అలాగే.. రూ.52.40 కోట్లతో 3,961 మంది రైతుల దగ్గర నుంచి 5,089 మెట్రిక్​ టన్నుల కొబ్బరిని సేకరించింది.

ఖరీఫ్​ సీజన్​లో మార్కెట్​కు వచ్చే పప్పుదినుసులు, నూనెగింజలు, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలుకు ఆయా రాష్ట్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 10 లక్షల ఉద్యోగాల హామీపై ముఖ్యమంత్రి ఎగతాళి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.