సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాను దారిలోకి తెచ్చేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏసీలు, రిఫ్రిజిరేటర్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు దిగుమతి విధానాన్ని సవరిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్... నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకునే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక త్రైమాసికంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏసీలు, రిఫ్రిజిరేట్ల విలువ దాదాపు 158.87 మిలియన్ డాలర్లు కాగా... ఇందులో దాదాపు 97 శాతంపైగా చైనా, థాయిలాండ్ నుంచే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో వెనక్కి వెళ్లకుండా నాటకాలాడుతున్న చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌ల వాడకంపై నిషేధం విధించిన భారత్... తాజాగా దిగుమతి విధానాన్ని సవరించి చైనాపై మరింత ఒత్తిడి పెంచింది.
ఇదీ చూడండి: చైనా స్మార్ట్‌ఫోన్ల కట్టడికి భారత్ వ్యూహం!