ETV Bharat / bharat

స్మగ్లింగ్​ కేసు: సర్కారుపై అవిశ్వాస అస్త్రం! - Chief Minister Pinarayi Vijayan

కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసు... ముఖ్యమంత్రి పినరయి విజయన్​ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సీఎం రాజీనామాకు పట్టుబడుతున్న ప్రతిపక్షం.. తాజాగా సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది.

Gold smuggling case:
పినరయి సర్కారుపై అవిశ్వాస తీర్మానం దిశగా యూడీఎఫ్​​
author img

By

Published : Jul 13, 2020, 5:42 PM IST

కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్​ నేతృత్వంలోని యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​. స్మగ్లింగ్​కు ముఖ్యమంత్రి కార్యాలయానికి లింకు ఉండటం వల్ల సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తోంది. ఈ మేరకు​ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది యూడీఎఫ్​.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ శ్రీరామక్రష్ణన్​ రాజీనామాను కోరుతూ.. ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకూ నిర్ణయించినట్లు యూడీఎఫ్​ కన్వీనర్​ బెన్ని బెహనన్​ తెలిపారు.

" ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం సహా స్పీకర్​కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ రోజు యూడీఎఫ్​ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్​ నేత రమేశ్​ చెన్నితలకు అప్పగించింది కూటమి. స్మగ్లింగ్​ కేసులో స్పీకర్​కు సంబంధాలు ఉన్నందున ఆయన రాజీనామా చేసితీరాల్సిందే. ముఖ్యమంత్రి రాజీనామా కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరిగినట్లు ఇప్పడు నిర్ధరణ అయింది. సీఎం మాజీ కార్యదర్శి, మాజీ ఐటీ కార్యదర్శికి ఓ నిందితుడితో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమయింది."

- బెన్ని బెహనన్, యూడీఎఫ్​ కన్వీనర్​

బంగారం స్మగ్లింగ్​ కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు స్వప్న సురేశ్​, సందీప్​ నాయర్​లకు రిమాండ్​ విధించింది కొచ్చిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు. వారి అరెస్ట్​ తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ​ పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ లక్ష్యంగా ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది.

ఇదీ చూడండి: బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు

ఎన్​ఐఏ కోర్టు ముందుకు కేరళ బంగారు కి'లేడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.