ఇదీ చూడండి:గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్..!
భాజపాకు చెందిన 11 మంది మంది ఎమ్మెల్యేలతో పాటు, గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంటక్ పార్టీ(ఎంజీపీ) నుంచి చెరో ముగ్గురు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాషాయ పార్టీ బలం 20కి చేరింది. సావంత్ మళ్లీ అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఎంజీపీ నుంచి సుదిన్ ధావలికర్, మనోహర్, జీఎఫ్‌పీ నుంచి విజయ్ సర్దేశాయ్, వినోద్ పాలేకర్, జయేష్లున్నారు.
సుదీర్ఘ చర్చల అనంతరం...
పారికర్ మరణించిన అనంతరం గోవాలో మళ్లీ రాజకీయం వేడెక్కింది. భాజపా మెజార్టీ పడిపోయిందని... తమకు ప్రభుత్వాన్ని ఏర్పరిచేలా ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను కలిసింది కాంగ్రెస్. అనంతరం రాష్ట్రంలో వరుస సమావేశాల అనంతరం ప్రమోద్ సావంత్‌ను సీఎంగా ఖరారు చేసింది భాజపా. సావంత్‌ను సీఎంగా ఖరారు చేసిన భాజపాప్రమాణస్వీకారంజాప్యం చేస్తూ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కార్యక్రమం నిర్వహించింది.
అయితే... తమకు తగిన బలం లేనందున ఇతర చిన్న పార్టీల మద్దతు కోరింది కాషాయ పార్టీ. సుదీర్ఘ చర్చల అనంతరం వారి డిమాండ్లకు అంగీకరించిన భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. సుదిన్ ధావలికర్, విజయ్ సర్దేశాయ్‌లకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్లో ఈ పదవి లేకపోవటం గమనార్హం.
పారికర్ మరణానంతరం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించిన భాజపా పెద్దలు గోవాకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా జీఎఫ్‌పీ, ఎంజీపీ పార్టీల ఎమ్మెల్యేలతో పాటు, మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతు కోసం వేర్వేరు సమావేశాలు నిర్వహించారు.
ఇదీ చూడండి:పారికర్‌కు కడసారి వీడ్కోలు