గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శాసన సభ బలపరీక్షలో నెగ్గారు. ఐదు ఓట్ల తేడాతో సభ విశ్వాసాన్ని పొందింది భారతీయ జనతా పార్టీ. 36 మంది శాసనసభ్యుల్లో 20 మంది భాజపాకు మద్దతుగా నిలవగా 15 మంది వ్యతిరేకించారు.
భాజపాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలైన గోవా ఫార్వార్డ్ పార్టీ, ఎంజీపీలకు అసెంబ్లీలో మూడు చొప్పున సభ్యులున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు సైతం భాజపాకే మద్దతు పలికారు. 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
సభ్యులందరూ రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేయాలని ప్రమోద్ సావంత్ అభ్యర్థించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో ప్రమోద్ సావంత్ను ముఖ్యమంత్రిగా నియమించింది భాజపా అధిష్ఠానం.
ఇదీ చూడండి:లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరం : బీఎస్పీ అధినేత్రి