ETV Bharat / bharat

కరోనా చికిత్సలో కీలక ఘట్టానికి భారత్​

కరోనా మహమ్మారి చికిత్స కోసం భారత్​ చేపడుతున్న పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయి. వైరస్​ నియంత్రణకు యాంటీ-వైరల్​ ఔషధం 'ఫవిపిరవిర్'​ క్లినికల్​ ట్రయల్స్​ను మూడో దశలో భాగంగా కరోనా రోగులపై చేయనున్నట్లు 'గ్లెన్​మార్క్​ ఫార్మాస్యూటికల్స్'​ పేర్కొంది.

Glenmark initiates Phase- 3 clinical trials on Favipiravir
కరోనా చికిత్సలో కీలక ఘట్టానికి చేరుకున్న భారత్​
author img

By

Published : May 12, 2020, 3:49 PM IST

కరోనా చికిత్సలో సత్ఫలితాన్నిస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం 'ఫవిపిరవిర్‌' క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్‌ సోకిన రోగులపై పరీక్షించనున్నట్లు 'గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌' వెల్లడించింది. ఈ డ్రగ్‌ను పరీక్షించేందుకు గత నెల 'డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా'(డీసీజీఐ) సంస్థకు అనుమతులిచ్చింది. 'ఫవిపిరవిర్‌' కరోనాను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో భారత్‌లో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని గ్లెన్‌మార్క్ ఓ ప్రకటనలో తెలిపింది.

కొవిడ్​ పరీక్షలో ముందడుగు పడినట్లే..

ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం పది సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయని గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది. జులై లేదా ఆగస్టు నాటికి ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రోగుల చికిత్సకు 14 రోజులు, అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుందని తెలిపింది. ఈ డ్రగ్‌ తయారీకి కావాల్సిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌(ఏపీఐ), సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కొవిడ్​ చికిత్సలో ముందడుగు పడినట్లేనని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడిలో ఇది కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు.

బాధితులు త్వరగా కోలుకునే అవకాశం...

జపాన్‌లో ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం 'ఫవిపిరవిర్‌'ను కనుగొన్నారు. కరోనా మహమ్మారి వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఈ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. జపాన్‌కు చెందిన టొయామా కెమికల్‌ అనే కంపెనీకి చెందిన 'అవిగన్‌' అనే బ్రాండుకు ఫవిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.