ETV Bharat / bharat

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా గిరీశ్ చంద్ర ముర్ము - Girish Chandra Murmu

జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Girish Chandra Murmu appointed as the Comptroller & Auditor General of India
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా గిరీశ్ చంద్ర ముర్ము
author img

By

Published : Aug 6, 2020, 11:00 PM IST

Updated : Aug 7, 2020, 1:38 AM IST

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్మును నియమించింది కేంద్రం. ముర్మును సీఏజీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్ మెహర్షి శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శనివారం రాష్ట్రపతి భవన్​లో ప్రమాణస్వీకారం చేసి 'కాగ్​'గా బాధ్యతలు స్వీకరించనున్నారు ముర్ము.

girish-chandra-murmu-appointed-as-the-comptroller-and-auditor-general-of-india
కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు

రాజీనామా

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బుధవారం సాయంత్రం ముర్ము రాజీనామా చేశారు. నూతన కాగ్​గా నియమితులవుతారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.

అక్టోబర్ 29న జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు తీసుకున్నారు ముర్ము. గుజరాత్​ కేడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అయిన ముర్ము.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టక ముందు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

Last Updated : Aug 7, 2020, 1:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.